శుక్రవారం, జూన్ 05, 2020
కాళేశ్వరం: మహారాష్ట్రలోని సిరొంచా పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం వెలుగుచూసింది. ఆ నగదు ఎవరిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది చర్చనీయాంశమైంది. కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన అవతలి వైపు గల మహారాష్ట్ర చెక్‌పోస్టు వద్ద సిరొంచా పోలీసుల తనిఖీల్లో రూ. కోటి స్వాధీనం చేసుకోగా.. సిరొంచా ప్రాణహిత నది వద్ద గల మరో చెక్‌పోస్టు వద్ద రూ. కోటీ 20 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మూడు రోజుల కిందట మంచిర్యాల నుంచి ప్రాణహిత వంతెన మీదుగా సిరొంచా వైపు వస్తున్న ఒక వాహనంలోని వ్యక్తుల వద్ద నుంచి, మరో వాహనంలో వరంగల్ నుంచి కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తున్న కొందరి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Comments
Post a Comment